GHMC కొత్త ప్లాన్: మ్యాన్ హోల్ ప్రమాదాలకు చెక్

హైదరాబాద్ లో వర్షాకాలంలో ఎక్కువగా మ్యాన్ హోల్ ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్ని ఘటనల్లో ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీంతో మ్యాన్ హోల్ ప్రమాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు జిహెచ్ఎంసి కొత్త ప్లాన్  రెడీ చేసింది. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఈ విషయమై కమిషనర్ దానకిషోర్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష‌ సమావేశం నిర్వహించారు.  దీనిలో భాగంగా కంప్లైట్ అందిన 5 నుంచి 24 గంటల్లో సమస్య పరిష్కరించే విధంగా ప్రణాళిక రూపొందించారు.

వారం రోజుల్లోగా మ్యాన్‌హోల్ కవర్లన్నింటినీ అమర్చాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. నో ఓపెన్ మ్యాన్ హోల్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు 8897477250 నెంబర్ తో ఒక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ఎక్కడ మ్యాన్ హోల్ పాడైనా, కనిపించకపోయినా వెంటనే గుర్తించి ఫోన్ ద్వారా అక్కడి పరిస్థితిని ఫోటో లేదా వీడియో  తీసి.. ఏరియా వివరాలు, సమీప ల్యాండ్ మార్క్ లేదా ఇంటి నంబర్ వివరాలను వాట్సాప్ నంబర్ కు పంపాలని కమిషనర్ కోరారు.  కంప్లైంట్ అందిన వెంటనే సంబంధిత అధికారులు ఆ కంప్లైంట్ కు ఒక టోకెన్ నంబర్ ఇస్తారు. కంప్లైంట్ స్టాటస్ ను ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా పంపుతారు.  www.ghmc.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా కూడా స్టాటస్ తెలుసుకోవచ్చని కమిషనర్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates