GHMC స్పెషల్ డ్రైవ్ : సిటీలో ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు

ఫుట్ పాత్ ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది GHMC. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ లో ఫుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగిస్తున్నారు అధికారులు. ECIL చౌరస్తా నుంచి సైనిక్ పురి వరకు ఫుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగిస్తున్నారు. కుత్బుల్లాపూర్ జీన్స్ ఫ్యాక్టరీ నుంచి సుచిత్ర చౌరస్తా మీదుగా కూకట్ పల్లి వరకు… బార్కాస్ నుంచి కేంద్రీయ విద్యాలయ పాఠశాల మీదుగా చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు.. మూడు మార్గాల్లో మొత్తం 12 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫుట్ పాత్ లపై ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నారు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. మొత్తంగా ఇవాళ వెయ్యి అక్రమ కట్టడాలను తొలగించనుంది బల్దియా.

Posted in Uncategorized

Latest Updates