హైదరాబాద్ వాసులను హెచ్చరించిన జీహెచ్ఎంసీ కమిషనర్

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్. లోకేష్ కుమార్ సూచించారు. మరికొన్ని రోజులు వర్షాలు ఇలాగే పడే అవకాశం ఉన్నందున.. శిధిలావస్థకు చేరిన భవనాలు, ప్రహరీ గోడలు, ఇతర నిర్మాణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వాతావరణ శాఖ నుండి వచ్చే హెచ్చరికలు, కాల్ సెంటర్, వాట్సాప్ లు, కంట్రోల్ రూమ్ నుండి అందే ఫిర్యాదులకు తక్షణమే స్పందించుటకు సిబ్బంది అందుబాటులో ఉండాలని అధికారులు, మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించారు.శిథిలావస్థకు చేరిన భవనాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకరంగా వున్న నిర్మాణాలలో నివసిస్తున్న ప్రజలను తక్షణమే ఖాళీ చేయించి.. వాటికి సీల్ వేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈ అంశంలో గతంలో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేశారు. అటువంటి నిర్మాణాలకు నోటీసులు అంటించి.. చుట్టూ బారికేడింగ్ చేయాలన్నారు. అలాగే కొత్త సెల్లార్ల తవ్వకాలను నిషేధించినట్లు తెలిపారు. గతంలో చేపట్టిన సెల్లార్ల రక్షణకు చర్యలు తీసుకోవాలని బిల్డర్లకు సూచించారు. ప్రమాదకరంగా వున్న సెల్లార్లను భవన నిర్మాణ, శిధిల వ్యర్ధాలతో నింపాలని కోరారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ఏటవాలు, కొండ ప్రాంతాలలో తాత్కాలిక నివాసాలు మరియు ప్రమాదకరంగా వున్న ప్రహరీలకు ఆనుకుని వేసుకున్న షెడ్లలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమీషనర్ ఆదేశించారు.

For More News..

తెలంగాణ గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి రామానుజం

ప్రగతిభవన్ లో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

మంచి జరిగితే తన ఖాతాలో.. చెడు జరిగితే కేంద్రం ఖాతాలో..

Latest Updates