మాతోనే అభివృద్ధి సాధ్యం.. వేరేవాళ్ళు గెలిస్తే చేయలేరు

“బీజేపీ వాళ్లు ఇప్పుడు మొక్కుతారు.. ఆ తర్వాత ఓట‌ర్ల నెత్తి మీద చేయి పెడతారని” అన్నారు మంత్రి హ‌రీష్ రావు. జీహచ్ఎం‌సీ ఎన్నిక‌ల నేప‌థ్య‌ంలో మంత్రి హ‌రీష్ రావు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం లోని 112 వ డివిజన్ లో ప్రచారం నిర్వహించారు ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు న‌ల్లా బిల్ రూ.10 వేల దాకా వచ్చిందని, ఇపుడు నెల నెలకు నల్లా బిల్ రాదని, బిల్ మొత్తం టీఆరెస్ సర్కార్ కట్టనుందని అన్నారు.

పనులు కావాలంటే చేసి పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని, వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే అభివృద్ధి చేయలేరని అన్నారు హ‌రీష్ రావు. వరదలు వస్తే, అడగక ముందే రూ.10వేలు ఇచ్చామ‌ని, వరద సాయం అందని వాళ్లకు.. ఎన్నికల తర్వాత 10 వేలు ఇచ్చే బాధ్యత త‌న‌ద‌ని అన్నారు. అర్హులకు రేషన్ కార్డులు ఇస్తామ‌ని, మ‌రో రెండు నెలల్లో పఠాన్ చేరు వాసులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.

Latest Updates