ముగిసిన గ్రేట‌ర్ ఎన్నిక‌ల పోలింగ్.. 14 డివిజన్లలో 5 శాతం మాత్రమే ఓటింగ్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఉదయం సమయంలో ఎక్కువగా నమోదైన పోలింగ్.. మధ్యాహ్నం భారీగా తగ్గిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 14 డివిజన్లలో కేవలం 5 శాతం మాత్రమే ఓట్లు నమోదయ్యాయి. మొత్తంగా గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది.

ఐటీ కారిడార్‌లో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గుర్తుల తారుమారు వల్ల ఒక్క ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో మాత్రమే రీ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గ్రేటర్‌ పరిధిలోని 149 డివిజన్లలో పోలింగ్‌ ముగియగా ఈనెల 4న ఓట్లు లెక్కించనున్నారు.

Latest Updates