మా వల్లే అభివృద్ధి సాధ్యం.. బక్క కేసీఆర్ ను కొట్టడానికి ఇంత మందా

CM KCR speech on GHMC Elections 2020

బక్క కేసీఆర్ ను కొట్టడానికి ఇంత మందా… అన్నీ రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు  మున్సిపల్ ఎలక్షన్ కోసం వస్తున్నారు. Ghmc ఎన్నికలా.. లేదంటే నేషనల్ ఎన్నికలా అనే అనుమానం వస్తోందని అన్నారు కేసీఆర్. టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ రెండు జాతీయ పార్టీలు దేశాన్ని నడపడంతో విఫలం అయ్యాయని ఎద్దేవా చేశారు. నేను ఢిల్లీకి వెళ్తానని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూస రాజకీయలు పోతేనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్న ఆయన  గుల్ దస్తా లాంటి హైదరాబాద్ కోసం అందరం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎన్నికలు అయిపోతే ఎవరు ఉంటరు…ఎన్నికలు అయిపోగానే ఎక్కడి వాళ్లు అక్కడికే పోతారు. ఇక్కడ అభివృద్ధి మన ప్రభుత్వంతో జరుగుంది…పక్క రాష్ట్రం నుంచి వచ్చినోడు ఏదో ముచ్చట్లు చెప్పిపోతడాని అన్నారు కేసీఆర్

Latest Updates