ఓటు హ‌క్కు వినియోగించుకున్న రాజ‌శేఖ‌ర్ దంప‌తులు

హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పోలింగ్‌ నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ .. సాయంత్రం ఆరుగంటలకు ముగియనుంది. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఏడాది పోలింగ్ శాతం తక్కువగా నమోదౌతున్నట్లు తెలుస్తోంది. కరోనా భయంతో ప్రజలు ఓటు వేయడానికి కూడా రావడం లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

ఈ క్ర‌మంలో సినీ న‌టుడు రాజ‌శేఖ‌ర్ దంపతులు న‌గ‌రంలోని ఓ పోలింగ్ బూత్ లో త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డి కోలుకున్న ఆయ‌న‌.. ఓట‌ర్ల‌ను చైత‌న్య ప‌రిచేలా ఓటు వేసిన‌ట్టు మీడియాకు తెలిపారు. స‌తీమ‌ణి జీవిత తో క‌ల‌సి ఆయ‌న త‌న ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

 


Latest Updates