సమస్యలు పరిష్కరించేవాళ్లను గెలిపించాలి

హైదరాబాద్: బస్తీలో పిలిస్తే పలికే వాళ్లను, సమస్యలు పరిష్కరించేవాళ్లను గెలిపించాలన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. సోమవారం మౌలాలిలో జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ అబద్ధాలు చెప్పి మోసం చేసిందన్న రేవంత్ రెడ్డి..ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. కరోనా సమయంలో నల్లా బిల్లులు, ఇంటిపన్నులు రద్దు చేయలేదన్నారు. వరదల్లో మునిగిపోయిన ఇండ్లకు పదివేల సాయం బాధితులకు కాకుండా టిఆర్ఎస్ వాళ్లకు ఇచ్చారన్నారు రేవంత్ రెడ్డి.

Latest Updates