ముషీరాబాద్ లో అక్బరుద్దీన్ ఒవైసీకి చేదు అనుభవం

భోలక్ పూర్ లో మాట్లాడకుండానే వెనుదిరిగిన అక్బరుద్దీన్

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో మజ్లిస్ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒవైసీ సోదరులను జనం నిలదీస్తున్నారు. నిన్న జాంబాగ్ లో అసదుద్దీన్ ఒవైసీని మహిళా ఓటర్లు నిలదీయగా.. ఇవాళ తమ్ముడు అక్బరుద్దీన్ కు దాదాపు అలాంటి నిరసనే ఎదురైంది.  గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ భోలక్ పూర్ లో చంద్రయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం ఎదురైంది. ముషీరాబాద్ పరిధిలోని 86వ వార్డులో ఎంఐఎం పార్టీ ఏర్పాటు చేసిన సభలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు.  ముస్లిం వర్గీయులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి.. అంటూ స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడి నుండి మాట్లాడకుండానే వెనుదిరిగారు అక్బరుద్దీన్. మాకు రాజకీయ మాటలు అవసరంలేదు అభివృద్ధి అవసరమన్న ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలు నినాదాలతో స్పష్టం చేశారు. స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అసంతృప్తితో ఎన్నికల ప్రచారం చేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు అక్బరుద్దీన్ ఓవైసీ.

for more News…

హైదరాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

ఆ ఊరిలో అమ్మాయి పుడితే 5వేలు డిపాజిట్.. పెద్దయ్యాక ఊరోళ్లే పెళ్లి కూడా చేేస్తారు

చిన్న పట్టణాల్లో ఉద్యోగాలిస్తాం-బీపీఓ కంపెనీలు

గుడ్లు ఫ్రిజ్​లో స్టోర్​ చేస్తే డేంజర్

రాత్రిపూట మహిళలకు ఫ్రీ రైడ్ అంటూ వైరల్ మెసెజ్

Latest Updates