ఆర్జీవీకి భారీ షాక్

రాం గోపాల్ వ‌ర్మ‌కు జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు.లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడినా ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో పవర్ స్టార్ సినిమా రిలీజ్ చేసి లాభాలను ఆర్జిస్తున్నాడు. ఆ సినిమా విడుద‌లకు ముందు ఆర్జీవీ జీహెచ్ ఎంసీ ప‌రిధిలో ఉన్న ప్రాంతాల్లో 30కి పైగా పోస్ట‌ర్ల‌ను అంటించారు. ఆ పోస్టర్ల‌పై జీహెచ్ఎంసీ అధికారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అనుమతి లేకుండా పవర్ స్టార్ సినిమా పోస్టర్లను ఏర్పాటు చేసినందుకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్ మెంట్ విభాగం ఆర్జీవీకి భారీగా ఫైన్ విధించింది. సినిమా విడుద‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 88వేల రూపాయాల్ని జ‌రిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది.

Latest Updates