ఈనెల 18న GHMC జాబ్‌ మేళా

హైదరాబాద్ లోని నిరుద్యోగులకు GHMC ఉపాది  కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ నెల 18వ తేది (సోమవారం) హరిహర కళాభవన్‌లో జాబ్‌ మేళా నిర్వహించనుంది. సికింద్రాబాద్‌ జోన్‌ పరిదిలో యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ మేళాకు 20కి పైగా ప్రైవేటు, కార్పోరేట్‌ కంపెనీలు హజరు కానున్నట్లు DMC ఉమాప్రకాష్‌ తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అభ్యర్థులకు అవగాహన తర్వాత ఇంటర్వ్యూలుంటాయన్నారు. పదవ తరగతి పాస్‌ లేదా ఫెయిల్‌ ఆయిన వారితో పాటు ITI , ఇంటర్‌, డిగ్రీ సహ PG వంటి ఉన్నత విద్యలు చదివిన అభ్యర్థుందరూ సంబందిత సర్టిఫికెట్లతో జాబ్‌ మేళాకు హజరై ఉపాది పొందాలని సూచించారు.

Latest Updates