వాహనం ఢీ కొని జీహెచ్ఎంసీ కార్మికురాలు మృతి

పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం  జిహెచ్ఎంసి కార్మికురాలు భారతమ్మ (57) ను ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. . విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన భారతమ్మ బస్సు దిగి మాంగల్య షోరూం దగ్గర రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గత 16 సంవత్సరాలుగా జిహెచ్ఎంసి ఔట్ సోర్సింగ్  కార్మికులుగా విధులు నిర్వహిస్తుంది.

see more news

భారత్ సంచలన విజయం.. కంగారూలను చితగ్గొట్టిన పంత్, గిల్

టీమిండియాకు రూ.5 కోట్ల భారీ నజరానా

Latest Updates