రోడ్డుపై నీరు వదిలినందుకు రూ.2 లక్షలు ఫైన్

  • బిల్డింగ్ ఓనర్ పై జీహెచ్ఎంసీ అధికారుల చర్యలు

గచ్చిబౌలి,వెలుగు:సెల్లార్ నిర్మిస్తుండగా చేరిన వర్షపు నీటిని మోటార్​తో రోడ్డుపై వదలిన ఓ బిల్డింగ్ ఓనర్ కి జీహెచ్​ఎంసీ అధికారులు రూ.2లక్షలు ఫైన్ విధించారు. వివరాల్లోకి వెళితే..గచ్చిబౌలి డివిజన్​ బయోడైవర్సిటీ పార్కు సమీపంలో హోటల్ పక్వాన్ ఎదుట ఓ సెల్లార్​ నిర్మాణంలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా వర్షపు నీరు అందులో చేరింది. గురువారం బిల్డింగ్ ఓనర్ సెల్లార్​లో నిలిచిన నీటిని మోటార్ సాయంతో రోడ్డుపై వదలడంతో అక్కడ  భారీగా నీరు చేరి ట్రాఫిక్​జామ్ ఏర్పడింది. దీంతో పాటు రోడ్డు గుంతలమయంగా మారుతుండడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బల్దియా అధికారులకు సమాచారం అందించారు. జీహెచ్ఎంసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ నిర్మాణదారుడికి రూ.2 లక్షలు జరిమానా విధించారు.

Latest Updates