దోమలపై జీహెచ్ఎంసీ ఫాగింగ్ ఆపరేషన్

హైదరాబాద్ లో దోమలపై జీహెచ్ఎంసీ ఫాగింగ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. చార్మినార్ జోన్ లో గత మూడు వారాలుగా సూర్యోదయం కంటే ముందే ఫాగింగ్ ఆపరేషన్స్ చేస్తోంది. మలేరియా నివారణ సిబ్బందితో కలిసి… సీజనల్ వ్యాధులపై జీహెచ్ఎంసీ ఫాగింగ్ లో పాల్గొంటోంది. ఎక్కువగా వరద ముంపు ప్రాంతాలపై ఫోకస్ పెట్టింది. 27 వరద ముంపు ప్రాంతాల్లో ఏక కాలంలో 72 ఫాగింగ్ మెషీన్స్ తో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఉదయం పూట బయటకొచ్చే దోమలను నిర్మూలించే పనిలో ఉన్నారు.

ఇరవై రోజుల కింద భారీ వర్షాలకు రాజేంద్రనగర్ డివిజన్ లోని సుబాన్ కలోని, ఆలీ నగర్, బండ్లగూడ జాగీర్ పరిసరాలు నీటమునిగాయి. మలేరియా సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది దోమల మందు చల్లారు. GHMC సౌత్ జోన్  ఎంటమాలజిస్ట్ నామాల శ్రీనివాస్ 10 పెద్ద ఫాగ్గింగ్ మిషన్స్ ను వినియోగించారు. ప్రజలు డెంగీ, మలేరియా, చికెన్ గున్యా లాంటి రోగాల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

దేశంలో లక్షా25 వేలు దాటిన కరోనా మరణాలు

Latest Updates