ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నందుకు సూపర్ మార్కెట్ సీజ్

మెహిదిపట్నం: నిషేధించిన పాలిథీన్ కవర్లను ఉపయోగిస్తున్నందుకు మాసాబ్ ట్యాంక్ సమీపంలోని రత్నదీప్ సూపర్ మార్కెట్ ను జిహెచ్ఎంసి అధికారులు సీజ్ చేశారు. బ్యాన్ చేసిన ప్లాస్టిక్ బ్యాగులను సరుకుల ప్యాకింగ్ కోసం వాడుతున్నారనే సమాచారంతో జిహెచ్ఎంసి అధికారులు మార్కెట్  లో తనిఖీలు చేశారు. మంగళవారం జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ ముషర్రఫ్ అధ్వర్యంలో  జరిగిన ఈ సోదాల్లో వినియోగదారులకు బ్యాన్ చేసిన కవర్లనే ఇస్తున్నారని తెలిసింది. దీంతో  మార్కెట్ ను సీజ్ చేశారు. నిషేధించిన పాలిథిన్ కవర్లను ఉపయోగించిన వారి పై హైదరాబాద్ జిహెచ్ఎంసి, తగిన చర్యలు తీసుకుంటుందని జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Latest Updates