జీహెచ్‌‌ఎంసీకి సెల్‌ టవర్ల బకాయిలు

GHMC orders to the management of Cell Towers to pay dues

హైదరాబాద్‌‌, వెలుగు: జీహెచ్‌ ఎంసీకి భారీ మొత్తంలో బకాయి పడ్డ ఆస్తిపన్నును వెంటనే చెల్లిం చాలని నగరంలోని సెల్యూలర్‌‌ టవర్ల యాజమన్యాలను జీహెచ్‌ ఎంసీ కమిషనర్‌‌ ఎం-.దానకిశోర్‌‌ ఆదేశించారు. ఆస్తిపన్ను బకాయిల చెల్లిం పులపై సెల్‌ టవర్ల ఏజెన్సీల ప్రతినిధులతో మంగళవారం జీహెచ్‌ ఎంసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌‌ మాట్లా డుతూ హైదరాబాద్‌‌ నగరంలో ప్రధానంగా ఉన్న14 సెల్‌ టవర్ల ఏజెన్సీల నుంచి దాదాపు రూ.15 కోట్ల ఆస్తిపన్ను బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. ఈ బకాయిలనువెంటనే చెల్లిం చాలని, లేకుంటే రూల్స్​ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Latest Updates