రూ.20 కోట్లతో గణేష్ నిమజ్జనానికి GHMC ఏర్పాట్లు

గణేష్ నిమజ్జనం సందర్భంగా GHMC  రూ.20 కోట్లతో ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు(గురువారం, సెప్టెంబర్-12) హైదరాబాద్ లో అత్యంత వైభవంగా వినాయక నిమజ్జనం జరగనుంది. ప్రతి 3 కిలోమీటర్లకు ఒక యాక్షన్ టీంను, నిమజ్జన ప్రాంతాలలో 27 వైద్య శిబిరాలు, 92 మొబైల్ టాయిలెట్లు, 32 ప్రాంతాలలో 93 క్రేన్లు, 134 మొబైల్ క్రేన్లు, 32 కొలనులలో శుభ్రమైన నీటిని నింపడం చేయనున్నారు. వీటితో పాటు అన్ని చెరువుల దగ్గర గజ ఈతగాళ్ల నియామకం, 36,674 తాత్కాలిక టాయిలెట్లు, రోడ్లు భవనాల ద్వారా 12 కిమీ బారికేడ్లు, ఎలక్ట్రిక్ విభాగం నుండి 75 జనరేటర్లు, హుస్సేన్ సాగర్ లో వ్యర్ధాల తొలగించేందుకు 1,000 మంది, 115 వాటర్ క్యాంపులు, 36 ఫైర్ ఇంజన్లు, సరూర్ నగర్, ప్రగతి నగర్, కాప్రా చెరువుల దగ్గర మూడు బొట్లు, NDRF, హుస్సేన్ సాగర్లో ఏడు బోట్లు, పదిమంది గజఈతగాళ్ళు, హుస్సేన్ సాగర్ చుట్టూ 48 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ సరఫరాకు 101 అదనపు ట్రాన్స్ ఫార్మర్లు, ప్రతి సర్కిల్ లో ఒక హార్టికల్చర్ టీంలను ఏర్పాటు చేశారు GHMC అధికారులు. నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు తెలిపారు.

Latest Updates