కోర్టు స్టే ఉన్న స్థలంలో బల్దియా నిర్మాణాలు?

V6 Velugu Posted on Jan 26, 2022

ఖైరతాబాద్, వెలుగు: కోర్టు స్టే ఉన్నా తమ భూమిలో బల్దియా నిర్మాణాలు చేపడుతోందని రహమత్ నగర్ కు చెందిన బాధితుడు ధారాసింగ్ ఆరోపించాడు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఆయన మాట్లాడుతూ రాజ్ భవన్ రోడ్​లో 650 గజాల స్థలాన్ని 2000 సంవత్సరంలో సత్తమ్మ అనే మహిళ నుంచి కొన్నామన్నాడు. దానిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చిందన్నాడు. 15 రోజుల నుంచి ఆ స్థలంలో బల్దియా డిజాస్టర్ మేనేజ్​మెంట్ ​అధికారులు నిర్మాణాలు చేపడుతున్నారన్నాడు. మళ్లీ కోర్టును ఆశ్రయించగా స్టే ఉన్న స్థలంలోకి ఎవరూ ప్రవేశించకూడదని ఆదేశించిందన్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరాడు. 

Tagged Hyderabad, ghmc, dispute, structures, Court stay, Site

Latest Videos

Subscribe Now

More News