సమ్మర్ ఎఫెక్ట్ : ప్రతి జంక్షన్ లో GHMC చలివేంద్రాలు

గ్రేటర్ హైద్రాబాద్ లో ఉష్ణోగ్రతలు పెరగడంతో సిటీ జనం అల్లాడిపోతున్నారు. హై టెంపరేచర్ కు  సిటీ జనం పరేషాన్ అవుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు… సూర్యుడి ప్రతాపానికి మాడు పగిలిపోతోంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ పనులపై బయటికి వచ్చేవారు ఎండ తీవ్రతను తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎండతీవ్రతకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది GHMC.

జనం నుంచి వచ్చిన ఫిర్యాదులతో చర్యలు ప్రారంభించింది జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు. సిటీలోని ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్. అసంపూర్తిగా ఉన్న బస్ షెల్టర్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. సిటీలో పనిచేయని 120 వాటర్ ఏటీఎంలను రిపేర్ చేయించాలని ఆదేశించారు. ఇవి పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలన్నారు. సిటీ పరిధిలో ఉన్న బోర్ వెల్స్, పవర్ బోర్ వెల్స్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

హైదరాబాద్ లో చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకురావాలని స్వచ్ఛంద సంస్థలకు పిలుపు నిచ్చారు కమిషనర్ దానకిషోర్. జలమండలి కూడా అందుకు సహకరిస్తుందని చెప్పారు.

Latest Updates