సముద్రంపై దెయ్యం కొమ్ములు

ఆ సముద్రానికి ఎర్రటి కొమ్ములు మొలుచుకొచ్చాయి. ఇది డిసెంబర్​ 26న సూర్యగ్రహణం సందర్భంగా ఖతార్​లోని పర్షియన్​ గల్ఫ్​లో కనిపించిన దృశ్యం. సూర్యుడు ఉదయిస్తున్న టైంలో చంద్రుడు అడ్డుగా ఉండడం వల్ల ఇలా దెయ్యం కొమ్ముల్లా కనిపించింది. ఇలియస్​ చాసియోటిస్​ అనే ఫొటోగ్రాఫర్​ దానిని క్లిక్​మనిపించాడు. ఖతార్​కు హాలిడే కోసం వెళ్లిన అతడు, అరుదైన సూర్యగ్రహణాన్ని క్లిక్​మనిపించేందుకు వెయిట్​ చేసి మరీ ఈ ఫొటోలు తీశాడు. దీనిని ఫతా మోర్గానా అంటారని చెబుతున్నాడు.

వేర్వేరు టెంపరేచర్లలో సూర్యుడి కిరణాలు గాలి పొరల గుండా వెళ్లినప్పుడు ఇలా కనిపిస్తుందని చెప్పాడు. మోర్గాన్​ లీ ఫే అనే మంత్రగత్తె పేరునే ఆ ఫినామినన్​కు పెట్టారని చెప్పాడు. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్​ అయ్యాయి. దానికీ కారణముంది. ఇరాన్​లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసిందే. ఆ పరిస్థితులకు ఈ దెయ్యం కొమ్ములను లింక్​ చేస్తూ నెటిజన్లు కామెంట్​ చేస్తున్నారు.

Latest Updates