బాబోయ్ .. దయ్యం చెట్టు: గాలి పీలిస్తే ఆస్తమా

  • ఏడాకుల పాల చెట్టు.. ఆరోగ్యానికి చేటు
  • దాని గాలి పీలిస్తే శ్వాస సంబంధ వ్యాధులు
  • హరిత హారంలో భారీగా నాటిన అధికారులు
  • ఇకపై వాటిపై నిషేధం విధించాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రమేశ్. ఆఫీసు పని ముగించుకుని రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వెళుతున్నాడు. ఇంటి దగ్గరలో ఓ సువాసన అతని ముక్కును గుప్పున తాకింది. వాసన ఏదో కొత్తగా ఉంది కదా అని అదే పనిగా పీలుస్తూ వెళ్లిన రమేశ్ కు ఒక్కసారిగా తల తిరిగినట్లయ్యింది. దాని ఎఫెక్ట్ తోనే జబ్బు చేసింది.

రమేశ్ ఒక్కడికే కాదు ఇటీవల కాలంలో ఇలాంటి వాసన పీల్చి శ్వాస కోశ, స్కిన్ అలర్జీలకు చాలా
మంది గురవుతున్నారు. దీనికి కారణం ఏడాకుల పాల చెట్టు. అటవీ ప్రాంతాల్లో దయ్యం చెట్టుగా
పిలిచే దీని శాస్త్రీయ నామం ఆల్సోటనియా స్కాలరీస్‌‌.

ఔషధ మొక్కల జాబితాకు చెందినదైనా అనారోగ్యం కలిగిం చే చెట్టుగా ఇటీవల పరిశోధనల్లో బయటపడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ హరితహారంలో ఈ మొక్కలను నాటొద్దని అటవీ శాఖ నిర్ణయించింది. పీలిస్తే శ్వాసకోశ వ్యాధులు, అలర్టీలు నీళ్లు లేకపోయిన ఏపుగా, అత్యంగా వేగంగా
ఏడాకుల పాల చెట్టు పెరుగుతుంది. పొడవుగా పెరిగి బూడిద రంగు బెరడును కలి ఉండే ఈ చెట్టు కొమ్మలు ఎండాకాలంలో చల్లదనాన్నిస్తాయి. ఈ చెట్టు కొమ్మలు వలయంగా ఉండి, ఒకే చోట గుచ్ఛంగా ఏడు ఆకులే ఉంటాయి. ఆకులను గిల్లుతే పాలు కారుతాయి. అందువల్లే దీనిని ఏడాకుల పాల చెట్టు అని పిలుస్తారు.

గాలి పీలిస్తే ఆస్తమా

ఏడాకుల పాల చెట్టు పుప్పొడి రేణువులు గాలిలో కలిసిపోయి మనుషులకు అస్తమాలాంటి శ్వాస
కోశ వ్యాధులు, అలర్జీలనూ కలిగిస్తాయి. ఈ చెట్లు ఇంటి ఆవరణలో ఉన్న వారికి, ఇవి అధికంగా ఉన్న ఏరియాలో మార్నిం గ్‌ వాక్‌‌ చేసే వాళ్లపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వృద్ధులు, పిల్లలైతే త్వరగా అనారోగ్యానికి గురవుతారు.

రాష్ట్రవ్యాప్తంగా 5 కోట్లకుపైగా మొక్కలు

హరితహారంలో భాగంగా ఈ మొక్కలను లక్షలాదిగా నాటడంతో జాతీయ రహదారులవెంట, కాలనీల్లో విరివిగా కనిపిస్తున్నాయి. సచివాలయంలోని డీ బ్లాక్ మీడియా పాయింట్ వెనక ఈ మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న అంచనా ప్రకారం రాష్ట్రం లో 5 కోట్లకు పైగా ఏడాకుల పాల మొక్కలు నాటి నట్లు తెలిసింది. ఇప్పుడా మొక్కలు పెరిగి పెద్దవై
పుష్పించి పుప్పొడిని వెదజల్లుతున్నాయి. ఈ పుప్పొడితో వచ్చే గాలిని పీల్చి జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఇకపై హరితహారంలో ఈ మొక్కలను నాటకూడదని అటవీ శాఖ నిర్ణయించింది.

మరింత అధ్యయనం జరగాలి
హరితహారంలోనే కాదు అంతకు ముందు కూడా హైదరాబాద్ శివారులో ఏడాకుల పాల మొక్కలను నాటాం. వీటి వాసనతో శ్వాసకోశ వ్యాధులు వస్తున్నట్లు ‌వార్తలు వస్తున్నాయి. దీనిపై మరింత అధ్యయనం జరగాలి.

– దండా సుధాకర్ రెడ్డి, డీఎఫ్ వో, మేడ్చల్

ఇప్పటికే నాటిన వాటికిదే మందు
చలికాలంలో ఈ చెట్లు పువ్వులు పూసి గాలిలోకి పుప్పొడి వెదజల్లుతాయి. ఈ వాసన అలర్జీ,
అస్తమాతోపాటు ఊపిరితిత్తు లపైనా ప్రభావం చూపుతోంది. ఈ చెట్ల కొమ్మలను కొట్టేసి
ఫ్రూనింగ్ చేస్తే పువ్వులు పూయకుండా ఉంటాయి. మున్ముందు ఈ మొక్కలు నాటకపోవడం మంచిది.

– సుతారి సతీష్, వృక్ష శాస్త్రవేత్త, హెచ్ సీయూ

Latest Updates