ఫ్యాన్ గాలి.. వైసీపీలోకి వలసలు కంటిన్యూ

హైదరాబాద్ : వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. లోటస్ పాండ్ లోని తన నివాసంలో టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు కొందరిని వైసీపీలోకి ఆహ్వానించారు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి . గిద్దలూరు టీడీపీ ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్ లు వైసీపీ కండువా కప్పుకున్నారు. గిద్దలూరు ఎంపీపీ వంశిధర్ రెడ్డి, అర్ధవీడు ఎంపీపీ రవికుమార్, అర్ధవీడు జడ్పీటీసీ వెంకటలక్ష్మి, ఎంపీటీసీ రామకృష్ణా రెడ్డి, సింగల్ విండో సొసైటీ అధ్యక్షులు కృష్ణా రెడ్డి, ఎదురు శ్రీనివాస్ రెడ్డి, ఉడుముల సుధాకర్ రెడ్డి, రంగారెడ్డి లు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. గిద్దలూరు నియోజకవర్గ సమన్వయ కర్త అన్నా రాంబాబు ఆధ్వర్యంలో 40 మంది జగన్ పార్టీలో చేరారు.

Latest Updates