వేలానికి ప్రధాని మోడీ గిఫ్ట్ లు

ప్రధాని నరేంద్ర మోడీ గిఫ్ట్‌లను ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ప్రధాని 2,772లకు పైగా గిఫ్ట్ లు అందుకున్నారు. ప్రస్తుతం నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్స్‌లో ప్రదర్శనకు ఉంచిన ఈ కానుకలను ఈ నెల 14 నుంచి వేలం వేయనున్నట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు. వాటి ద్వారా వచ్చిన నిధులను గంగానది ప్రక్షాళన కోసం వినియోగించనున్నట్టు చెప్పారు.

ప్రధానికి ఆయా సంస్థలు, సీఎంల నుంచి అందిన గిఫ్ట్ ల్లో తలపాగాలు, శాలువాలు, ఫొటోలు, విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు పొరుగుదేశాలకు చెందిన ప్రతినిధులు ప్రధానికి ఇచ్చిన గిఫ్ట్‌లు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం 2,772 కానుకలను ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టనున్నట్టు ప్రహ్లాద్ పటేల్ తెలిపారు. రూ.200 నుంచి రూ.2.5 లక్షల మధ్య వీటి ధరలు ఉంటుందన్నారు.

ఈ ఏడాది జనవరిలోనూ ఇలాగే  రెండు వారాల పాటు జరిగిన వేలంలో ప్రధానికి అందిన 1,800 పైగా గిఫ్ట్ లను అమ్మకానికి పెట్టారు. ఈ నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంగానది ప్రక్షాళన ప్రాజెక్టు ‘నమామి గంగే’ కోసం ఉపయోగించారు.

Latest Updates