పంత్‌‌.. ధోనీని అనుకరించొద్దు

న్యూఢిల్లీ : మైదానంలో తడబడుతున్న రిషబ్ పంత్‌‌.. సీనియర్‌‌‌‌ వికెట్‌‌ కీపర్‌‌‌‌ ఎంఎస్ ధోనీని ఏమాత్రం అనుకరించొద్దని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌‌‌‌ ఆడమ్‌‌ గిల్‌‌క్రిస్ట్‌‌ సూచించాడు. ‘ఇండియా ఫ్యాన్స్​కు, మీడియాకు  నా సూచనేంటంటే.. ఎప్పుడూ పంత్‌‌ను ధోనీతో పోల్చవద్దు. అందరూ మరో ధోనీని సిద్ధం చేయాలనుకున్నారు. కానీ అది కుదరదు. నా అనుభవపూర్వకంగా చెబుతున్నా. ఇయాన్‌‌ హీలీ తర్వాత నన్ను ఆసీస్‌‌ టెస్ట్‌‌ జట్టుకు ఎంపిక చేశారు. హీలీలా ఆడాలని నేనెప్పుడూ అనుకోలేదు. అతడి నుంచి నేర్చుకొని గిల్‌‌క్రిస్ట్‌‌గా నిలవాలనుకున్నా. పంత్‌‌కు కూడా నేనిచ్చే సలహా ఇదే. ధోనీ అద్భుత కెరీర్‌‌‌‌ నుంచి నేర్చుకో కానీ అతన్ని అనుకరించవద్దు. పంత్‌‌గానే ప్రయత్నించు.’అని అన్నాడు.

 

Latest Updates