చెత్తకుప్పల్లో ఆడశిశువు.. బండబారిన కన్నమనసు!

జగిత్యాల జిల్లా : ఏం పాపం చేసుకుందో.. పుట్టీ పుట్టగానే చెత్తకుప్పల్లో చేరిపోయింది ఓ పసికందు. ఆడపిల్లగా పుట్టడమే ఆమె పాపమైనట్టుంది. ఆ పసిగుడ్డును కన్నతల్లి… గుండె బండబారినట్టుంది. కన్నప్రేమ ఆ తల్లిదండ్రులకు ఆవిరైనట్టుంది. కారణాలేం తెలియదు కానీ… ఏ పాపం తెలియని గంటల వయసున్న పసికందు చెత్తకుప్పల్లో కనిపించింది.

కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్ ప్రాంతంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెట్ల పొదల్లో పడేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఆ చిన్నారి పాప ఆరోగ్యంగా ఉంది. పాప ఏడుపు విని స్థానికులు అక్కడికి వెళ్లారు. పాత చీరలో చుట్టి పాపను చుట్టి ఉన్న పాపను చూశారు. వెంటనే చిన్నారిని దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పోలీసుల సాయంతో.. పాపను శిశువిహార్ కు తరలించారు.

Latest Updates