కన్నతల్లి పొమ్మంది.. మానవత్వం రమ్మంది

  • గోనె సంచిల చుట్టి.. పాయిఖాన పక్కన పడేశారు
  • ఎర్రచీమలు పట్టి గుక్కపెట్టి ఏడ్చిన పసిగుడ్డు
  • పోలీసులకు ఫోన్‌ చేసిన ఓ యువకుడు
  • లేడీ కానిస్టేబుల్, నర్సే అమ్మలయ్యారు
  • బొజ్జనిండా పాలు పట్టడంతో కేరింతలు
  • నేడు శిశువిహార్‌కు..

సికింద్రాబాద్‌, వెలుగు: ఆదివారం సాయంత్రం ఆరు గంటలవుతోంది. సికింద్రాబాద్‌
కింగ్స్ వే బైబిల్ హౌస్ రైల్వే బ్రిడ్జి పక్కనున్న పబ్లిక్ టాయిలెట్స్‌‌ దగ్గరి నుం చి కేర్‌ …కేర్‌ ..అని
ఏడుపు. పక్క నుంచి వెళుతున్న వెహికల్స్‌‌ శబ్ధాన్ని కూడా ఛేదించుకుని వినిపిస్తోంది. అప్పుడే
టాయిలెట్‌ కు వెళ్లిన రూమేష్‌ అనే యువకుడు ఇది విన్నాడు.

అటూ ఇటూ చూడగా ఓ గోనెసంచి కదులుతోంది. సంచి తీసి చూడగా ఓ పసిపాప కనిపించింది. ఇంకా బొడ్డు తాడు వేలాడుతోంది. శ్వాస ఆడడం లేదు. గట్టిగా ఊపిరి పీలుస్తూ వదులుతోంది. సంచి తీసి పక్కన పడేశాడు. అతడికి షాక్‌ కొట్టినంత పనైంది. పాప ఒళ్లంతా ఎర్రచీమలు పట్టి కొరుకుతున్నాయ్‌ . శరీరంపై కొన్నిచోట్ల చీమలను తీసేశాడు. ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫోన్‌ చేశాడు. నార్త్ జోన్ మార్కెట్ కా నిస్టేబుల్స్‌‌ స్వప్న, ధన్‌ రాజ్‌ , రవిలు వచ్చి లేట్‌  చేయకుండా గాంధీ దవాఖానకు తీసుకువెళ్లారు.

డాక్టర్లు ట్రీట్‌ మెంట్‌ చేసినా ఏడుపు ఆపలేదు. ఆకలవుతుందని అక్కడి నర్సులు కడుపునిండా పాలు పట్టారు. బొజ్జ నిండిన ఆ బుజ్జి పాపాయి ఏడుపు మానేసి బోసినవ్వులు చిందించింది. కా సేపయ్యాక హాయిగా నిద్రలోకి జారుకుంది. ఏ కారణంతో కన్నతల్లి వద్దనుకుందో ఏమో గానీ ఇలాంటి ఘటనలే మనిషిలో చచ్చిపోతున్న మానవత్వాన్ని అప్పుడప్పుడు తట్టి లేపుతుంటాయి. కేసు విషయమై సీఐ శంకర్‌ యాదవ్‌ మాట్లాడుతూ సీసీ కెమెరా లు పరిశీలిస్తున్ నామని, పాపను చికిత్స తర్వాత శిశువిహార్‌ కు తరలిస్తామన్నారు.

Latest Updates