రంగారెడ్డి జిల్లాలో బాలిక అదృశ్యం

రంగారెడ్డి జిల్లాలో బాలిక అదృశ్యం

రంగారెడ్డి జిల్లాలో ఓ మైనర్ బాలిక అదృశ్యం అయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు శంషాబాద్ విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాళ్లగూడ గ్రామానికి చెందిన శ్రీనివాస్, నిర్మల దంపతుల కూతురు పల్లవి ( 13). ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లో 6వ తరగతి చదువుతోంది. అయితే శనివారం రోజు ఇంటి నుంచి షాపుకని బయటకు వెళ్ళిన పల్లవి ఇంటికి రాలేదు. దీంతో బాలిక తల్లి దండ్రులు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రాళ్లగూడ గ్రామానికి చెందిన నర్సింహ్మ అనే యువకుడు తమ కూతురిని కిడ్నాప్ చేసి ఉంటాడని బాలిక తల్లి దండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.