ప్రియురాలి బెడ్ రూమ్ లో ప్రియుడు.. బిల్డింగ్ పై నుంచి దూకిన ప్రియురాలు

వాళ్లిద్దరు ప్రేమికులు. మాట్లాడుకోవడానికి  ఎక్కడా ప్లేస్  రకలేదన్నట్లూ..ప్రియుడు..,ప్రియురాలి బెడ్రూంలోనే మకాం పెట్టాడు. అయితే ఓ సమయంలో తల్లి రావడంతో భయాందోళనకు గురైన ప్రియురాలు..,ప్రేమికుణ్ని పారిపొమ్మనమని ..కిటికీలో నుంచి కిందకి దూకింది. యువకుడు గదిలో ఉండడాన్ని గమనించిన బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పీటీఐ కథనం ప్రకారం

ముంబై బెయిల్ బజార్ లో నివాసం ఉంటున్న ఓ యువతి..సునీల్ జెండే అనే యువకుణ్ని ప్రేమిస్తుంది. అయితే ఇద్దరు బయటకలిసి తిరిగితే ఇబ్బందులు తలెత్తుతాయిని భావించిన సునీల్..ప్రియురాలితో మాట్లాడుకునేందుకు ఆమె బెడ్రూంలోనే మకాం పెట్టాడు. అయితే ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే సునీల్..ప్రియురాలి గదికి వచ్చాడు. ఇద్దరు మాట్లాడుకుంటుండగా తన తల్లి రావడం గమనించిన యువతి భయాందోళనకు గురైంది.  ప్రియుడు సునీల్ ను పారిపొమ్మనమని సలహా ఇచ్చింది. తాను తల్లికంట పడకుండా ఉండేందుకు ఆవేశంతో  సెకండ్ ఫ్లోర్  కిటికీలో నుంచి కిందకి దూకింది. పై నుంచి దూకడంతో కాలు విరిగిపోయింది. కానీ సునీల్ కిందకి దూకే సాహాసం చేయకపోవడంతో యువతి తల్లికి చిక్కాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Latest Updates