పెట్రోల్ పోసి నిప్పంటించాడు : ప్రేమించలేదని విద్యార్థినిపై దాడి

girl-petrol-attack-lover-warangal
girl-petrol-attack-lover-warangal

వరంగల్‌: ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ సంఘటన ఇవాళ ఉదయం హన్మకొండలో జరిగింది. హాస్టల్ దగ్గర ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థినిపై నడిరోడ్డుపై పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. యువతిని కాపాడేందుకు స్నేహితురాలు ప్రయత్నించినా దుండగుడు ఆమెను కూడా బెదిరించి పారిపోయాడు. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. యువతిని వెంటనే MGM హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. యువతిని రవళి(20)గా గుర్తించారు. రవళిపై పెట్రోల్‌ తో దాడి చేసిన యువకుడిని అవినాష్‌ గా గుర్తించారు.

ప్రేమను నిరాకరించినందుకే..

దాడి చేసిన తర్వాత అవినాష్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. తన ప్రేమను నిరాకరించినందుకే రవళిపై దాడి చేసినట్లుగా చెప్పాడని తెలిపారు పోలీసులు. అవినాష్‌ వాగ్దేవి కాలేజీలో B COM ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. రవళి కూడా అదే కాలేజీలో BSC ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. రవళిది సంగెం మండలం రామచంద్రాపురంగా పోలీసులు గుర్తించారు.

Latest Updates