దారుణం… మనమరాలిని తల్లిని చేసిన తాత

girl-raped-by-her-own-grandfather-in-jagtial-telangana

కామంతో కళ్లు మూసుకున్న ఓ తాత తన మనమరాలిని తల్లిని చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలిక(15) జిల్లాలోని కస్తూర్బా స్కూల్ లో చదువుకుంటుంది. అయితే ఆ మధ్య తరచూ అనారోగ్యానికి గురికావడంతో ఆ అమ్మాయిని స్థానిక హాస్పిటల్ లో చూపించారు. టెస్ట్ చేసిన వైద్యులు బాలిక నాలుగు నెలల గర్భవతిగా చెప్పారు. దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి అప్పగించారు.

బాలికను ఆమె తల్లిదండ్రులు నిలదీయగా… సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు తాత (తండ్రి కి చిన్నాన్న) ఆమెను లొంగదీసుకున్నట్లుగా చెప్పింది. ఆమె తాత ఉపాద్యాయుడిగా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. దీంతో అతన్ని ఇంటికి పిలిచి అడుగగా తనపై అనవసరంగా అభాండం మోపుతున్నారని… తనకు ప్రణాహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బాలిక తరపు తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఇంటికి వెళ్లి పోలీసులు విచారించగా తన తాతే తనపై అత్యాచారం చేశారని చెప్పింది. దీంతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

Latest Updates