లిఫ్ట్​లో తమ్ముడికి ఉరి..కాపాడిన చిన్నారి

ఐదేళ్ల పిల్లాడు. వాడి కంటే ఏడాది, రెండేళ్లు పెద్దవాళ్లైన ఇద్దరు అక్కలు. ముగ్గురూ ఆడుకుంటూ లిఫ్ట్​ఎక్కారు. ఇంతలో పిల్లాడిమెడకు ఓ తాడు ఉరితాడులా బిగుసుకుంది. ఆ పిల్లాడి పెద్దక్క కంగారు పడకుండా,తమ్ముడిని రక్షించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. టర్కీలోని ఇస్తాం బుల్ లో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ అయింది. పిల్లలు ఆడుకుంటూ లిఫ్ట్​ ఎక్కారు. పిల్లాడు తన చేతిలో ఓ బొమ్మకు
కట్టిన తాడు పట్టుకుని లాక్కుంటూ లోపలికి వచ్చాడు. కానీ, ఆ తాడు లిఫ్ట్​లో ఇరుక్కుపోయింది. లిఫ్ట్ ​కిందకి వెళ్లే సరికి తాడు ఉరితాడులా బిగుసుకోవడంతో ఒక్కసారిగాలిఫ్ట్​లో పైకి లేచాడు. వెంటనే అతడి పెద్దక్కచిన్నారి కాళ్లు పట్టుకోవడమే కాకుండా,ఎమర్జెన్సీ బటన్ నొక్కింది. ఈ ఘటనంతా లిఫ్ట్​లో ని సీసీటీవీలో రికార్డయింది.

Latest Updates