పెళ్లి భారం కాకూడదని ఊరేసుకుంది

పెండ్లి చేద్దా మనుకుంటే..ఉరేసుకుంది

మల క్ పేట, వెలుగు: పెళ్లి చేసేందుకు తల్లి పడుతున్న కష్టాలు, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చూసి కూతురు ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని మాదన్నపేట పూలతోటకు చెందిన అలివేలు(27) అపోలో హోంలో పని చేస్తోంది. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి పెంచి పెద్ద చేసింది. ఇటీవల మేనబావతో అలివేలు వివాహం నిశ్చయమైంది. పెళ్లి కోసం తల్లి పడుతున్న ఇబ్బందులను, ఇంటి
ఆర్థిక పరిస్థితి గమనించిన అలివేలు మనస్తాపానికి గురైంది. బుధవారం పెళ్లి తేదీలను ఖరారు చేయడానికి తల్లి వరుడి ఇంటికి వెళ్లిన సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది.

ఇంటికి వచ్చిన అన్న గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Updates