బాల్కనీ విండో గ్రిల్స్ లో ఇరుక్కున్న చిన్నారి.. కాపాడిన సిబ్బంది

తలభాగం ఇరుక్కుపోవడంతో నరకయాతన

అదో ఏడందతస్తుల బిల్డింగ్. పాపం.. ఐదేళ్ల చిన్నపాప ఆడుకుంటూ బాల్కనీ విండో గార్డ్ గ్రిల్స్ మీదకు వచ్చింది. ఊచల మధ్యలో కాళ్లు పడి జారి పడిపోయింది. కానీ.. తల మాత్రం ఆ గ్రిల్స్ మధ్యే ఇరుక్కుపోయింది. తలభాగం వేలాడుతూ ఉన్న పరిస్థితుల్లో.. కాపాడండి అంటూ ఏడుస్తూ కేకలు పెట్టింది. పది నిమిషాలు ఆ చిన్నారి నరకయాతన అనుభవించింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్లు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. భవనం పైనుంచి ఒక మహిళా గార్డ్ ను 3 ఫ్లోర్లు కిందకు దించి పాప ఉన్న విండో దగ్గరకు చేర్చారు. పాపను ఆమె ఎత్తుకుని.. భయపడొద్దంటూ ధైర్యం చెప్పింది.

ఆ తర్వాత ఆ బిల్డింగ్ లోపలి నుంచి మిగతా సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తల ఇరుక్కున్న చోట విండో గ్రిల్స్ ను కట్ చేశారు. అలా.. సురక్షితంగా చిన్నారిని పైకి తీశారు. ఇది చూసినవారంతా హమ్మయ్య అనుకున్నారు.

ఈ సంఘటన ఈస్ట్ చైనాలో జరిగింది. చిన్నారిని ఇంట్లోనే ఉంచి ఆమె తల్లి సరుకుల కోసం బయటికి షాప్ కు వెళ్లిందట. ఈ సమయంలోనే పాప ప్రమాదంలో చిక్కుకుంది. అక్కడి అధికారులు వెంటనే స్పందించడంలో పాప బతికింది.

చైనాలో ఇలాంటి ప్రమాదాలు.. అధికారులు వెంటనే స్పందించి ప్రాణం కాపాడిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కొన్నేళ్ల కిందట.. కిటికీ నుంచి రెండేళ్ల చిన్నారి బయటకు పడిపోయింది. ఐతే.. కిటికీ ఊచలకు ఆమె డ్రెస్ ఇరుక్కుపోయి.. పాప గోడకు వేలాడుతూ కనిపించింది. ఫైర్ సిబ్బంది ఆమె ప్రాణాలను కాపాడారు.

 

Latest Updates