ఆట అంటే వీళ్ళది.. ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి టెన్నిస్.. వీడియో వైరల్

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్డౌన్ అయ్యింది. దాంతో ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. ఏం చేయాలో తోచక చేసిన పనులన్నింటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ఆ వీడియోలు చాలామందిని తెగ ఎంటర్ టైన్ చేస్తున్నాయి. తాజాగా ఇటలీకి చెందిన ఇద్దరు అమ్మాయిలు కూడా అలాంటి విచిత్రమైన వీడియో ఒకటి అప్ లోడ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇటలీలోని లిగురియన్ పట్టణమైన ఫినాలే లిగురేలోని విట్టోరియా మరియు కరోలా పెస్సినా అనే ఇద్దరు యువతులు రూఫ్ టాప్ ప్లేయర్స్. లాక్డౌన్ తో వీరిద్దరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దాంతో వారి ప్రాక్టీస్ కూడా ఆగిపోయింది. అయితే వారి కోచ్ మాత్రం ఇంటివద్ద ప్రాక్టీస్ చేయాలని వారికి చెప్పారు. విట్టోరియా మరియు పెస్పినా ఇద్దరూ ఎదురెదురు ఇళ్లలోనే ఉంటారు. దాంతో వారిద్దరూ రూఫ్ టాప్ లో టెన్నిస్ ఆడుతూ దాన్ని మొత్తం వీడియో తీసి తమ కోచ్ కు పంపించారు. అలా ఎందుకు పంపించారంటే.. కోచ్ వారిని ప్రాక్టీస్ చేస్తున్న వీడియో పంపించాలని చెప్పాడట. అందుకే వారిద్దరూ ఆటను వీడియో తీసి ఆయనకు పంపించారు. కరోనావైరస్ లాక్డౌన్ ఉన్నప్పటికీ ఆ ఇద్దరు యువతులు టెన్నిస్ ఆడి.. ఆ ఆటను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారని నెటిజన్లు అభినందిస్తున్నారు.

For More News..

‘కరోనా జంతువుల నుంచే వచ్చింది.. ల్యాబ్ నుంచి కాదు’

జియోలో వాటా కొన్న ఫేస్‌బుక్

Latest Updates