పోకిరీలను చితక్కొట్టిన అమ్మాయిలు

మ్యధ్యప్రదేశ్ లోని బెటుల్ లో విద్యార్థినులు అపర కాళీలుగా మారారు. తమను  వేధిస్తున్న పోకిరీలను చితక్కొట్టారు. స్కూల్ కు వెళుతున్న విద్యార్థులను  నలుగురు  యువకుల రోజు  వెంబడిస్తున్నారు. ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. బాధిత  విద్యార్థునుల   ఫిర్యాదుతో  నిఘా పెట్టిన పోలీసులు నలుగురు పోకరీలను  అదుపులోకి తీసుకున్నారు.

వారిని విద్యార్థులకు వద్దకు తీసుకువచ్చారు. రోడ్డుపై పోకిరీలను మోకాళ్లతో కూర్చోబెట్టి.. విద్యార్థులతో వారిని చెప్పులతో కొట్టారు. బాధిత స్కూల్ విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు పోకిరీల  చెంపలు వాయించారు. పోకిరీలకు బుద్ది వచ్చేందుకే విద్యార్థులతో కొట్టించామని పోలీసులు చెప్పారు.

Latest Updates