ఆడ, మగ అంగీకారంతోనే రేప్‌లు: పోలీస్ వివాదాస్పద వ్యాఖ్యలు

మహిళలపై జరిగే దాడులకు వాళ్లే కారణమంటూ పలువురు పోలీసులు విక్టిమ్ బ్లేమింగ్ కు దిగుతున్నారు. రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు అని, అమ్మాయిలు రెచ్చగొడితేనే అత్యాచారాలు జరుగుతున్నాయని వివాదాస్పద కామెంట్లు చేశాడు హర్యానాలోని గురుగ్రామ్ పోలీస్ ఒకరు. పొట్టి బట్టలు వేసుకోవడం, రాత్రులు బయట తిరగడం తప్పు అని అన్నాడు. ఓ జాతీయ మీడియా చానల్ స్రింగ్ ఆపరేషన్ ద్వారా పోలీసుల్లో కొందరి మైండ్ సెట్ ను బయటపెట్టింది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులతో స్పై కెమెరాలు పెట్టుకుని మాట్లాడగా.. వాళ్లు విడ్డూరమైన కామెంట్లు చేశారు.
పొట్టి డ్రస్సులు వేసుకుంటే పేరెంట్స్ చంపేయాలి
మగవాళ్లు ఎవరూ కావాలని బలవంతంగా రేప్ లు చేసే మృగాలు కాదని గురుగ్రామ్ కు చెందిన ఒక పోలీస్ అన్నాడు. ఆడ, మగ ఇద్దరి అంగీకారంతోనే అత్యాచారాలు జరుగుతాయని చెప్పాడు. అమ్మాయిలే రెచ్చగొట్టి అత్యాచారాలు చేయించుకుంటారన్నట్టు దారుణంగా మాట్లాడాడతను. అంతేకాదు, మహిళలు పొట్టిబట్టలు వేసుకోవడాన్ని.. అలా వేసుకుంటున్న వారి తల్లిదండ్రులను తిట్టిపోశాడు. అమ్మాయిలు ఎలా ఉండాలి, ఏ టైంలో చదువు కోవాలి, ఎప్పుడు బయట తిరగాలి అనేది పేరెంట్స్ సరిగా నేర్పడం లేదన్నాడు. పొట్టిబట్టలు వేసుకునే అమ్మాయిలను వాళ్ల తల్లిదండ్రులే చంపేయాలని, లేదంటే పేరెంట్సే ఆత్మహత్య చేసుకుని చావాలని అన్నాడు.
అమ్మాయిలకు చలి ఉండదా?
అమ్మాయిలే నేరాలను ఆహ్వానిస్తున్నారని, ఆ తర్వాత పోలీసులు ఏం చేస్తున్నారంటూ తమని అడుగుతారని అన్నాడా పోలీస్. రెండు చేతులు కలవకుండా చప్పట్లు మోగుతాయా, వాళ్లు వేసుకునే పొట్టి బట్టలు మరీ ఘోరంగా ఉంటున్నాయని అన్నాడు. రాత్రులు డ్యూటీలో ఉండే తామే చలికి వణుకుతుంటామని, కానీ అంత చిన్న డ్రస్సులు వేసుకునే అమ్మాయిలు మాత్రం ఎఫ్పుడు చలిని ఫీల్ అవ్వరని అన్నాడు. తాను సిటీలో రాత్రులు డ్యూటీ చేసేటప్పుడు చాలా సార్లు చూశానని, అమ్మాయిలు వేసుకునే డ్రస్సుల్లో చెస్ట్ అంతా కనిపిస్తోందని, కాళ్లు పూర్తిగా పిరుదుల వరకూ కనిపిస్తున్నాయని అన్నాడు. ఇలాంటోళ్లను పేరెంట్స్ చంపేయాలని, లేదా వాళ్లు చచ్చిపోవాలని అన్నాడు.
పార్టీలకు అబ్బాయిలతో వెళ్లొద్దు
ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ ఏరియాలో పని చేసే మరో పోలీస్ కూడా ఇలానే అమ్మాయిలకు సలహాలిచ్చాడు. ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్లొద్దని, ఎవరు ఎలా ఉంటారో చెప్పలేమని అన్నాడు. కేవలం పేరెంట్స్, రిలేటివ్స్ తో మాత్రమే రాత్రులు బయటికైనా, పార్టీలకైనా వెళ్లాలని చెప్పాడు. కానీ, కొంతమంది అమ్మాయిలు కొత్తగా పరిచయమైన అబ్బాయిలతో కూడా కనీసం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా బయటకు వెళ్లిపోతున్నారని అన్నాడు. రాత్రులు బయట వెళ్లిన అమ్మాయిలు వీలైనంత త్వరగా ఇంటికొచ్చేలా పేరెంట్స్ చూసుకోవాలని చెప్పాడు.

ఓ వైపు దిశ ఘటన తర్వాత దేశమంతా మహిళల రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఇలా మాట్లాడుతుండడంపై దారుణం. బాధితులదే తప్పు అన్నట్లుగా ఈ కామెంట్స్ ఉన్నాయంటున్నారు మహిళా సంఘాల నేతలు. మరోవైపు దిశ ఘటనలోనూ పోలీసుల నిర్లక్ష్యం ఉందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించిన నేపథ్యంలో పోలీసుల నుంచి ఈ రకమైన కామెంట్స్ రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

MORE NEWS:

ఆడ, మగ అంగీకారంతోనే రేప్‌లు: పోలీస్ వివాదాస్పద వ్యాఖ్యలు
9 గంటల నిద్ర చాలా డేంజరే!
ప్రతిభగల విద్యార్థులకు ఎల్ఐసీ అందిస్తున్న ఆర్థిక సాయం

రేప్‌లు జరగొద్దంటే.. మగవాళ్లు ఇలా చేయాలి

దిశపై నోరుపారేసుకున్న కామారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్

Latest Updates