అమెజాన్ లో భారీ ఆఫర్ కొట్టేసిన అమ్మాయిలు

కష్టపడి చదివితే సాధించలేనిదంటూ లేదని నిరూపించారు ఇద్దరు విద్యార్థినులు. ఇందుకు ప్రతిఫలంగా అమెజాన్ ఇండియా వీరికి రూ.27లక్షల వార్షిక వేతనంతో బంపర్ ఆఫర్ ఇచ్చింది. మేడ్చల్‌ జిల్లా దూలపల్లిలోని సెయింట్‌ మార్టిన్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో CSE నాలుగో సంవత్సరం చదువుతున్న మధురిమ, శిరీష ఈ ఆఫర్‌ కొట్టేశారు.

కాలేజీలో ఇటీవల జరిగిన ఇంటర్వ్యూల్లో వీరికి ప్లేస్‌ మెంట్స్‌ లభించాయి. కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ విద్యార్థినులకు ఆఫర్ లెటర్స్ అందజేశారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం మధురిమ, శిరిషను అభినందించింది. కష్టపడి చదివినందుకు నిజమైన ప్రతిఫలం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు  మధురిమ, శిరిష.

See Also: తెలుగులోనూ కరోనా కాలర్ ట్యూన్

టీమిండియాలో ఆ ముగ్గురికి అగ్ని పరీక్షే..!

ప్రభాస్ సినిమాకు టైటిల్ ఇదేనా..?

Latest Updates