పోతిరెడ్డిపాడుకు 71 టీఎంసీలు ఇవ్వండి

కృష్ణా రివర్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఇండెంట్

హైదరాబాద్, వెలుగు: పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు దాకా 71 టీఎంసీ ల నీటిని తీసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ ఎంబీ)ని ఏపీ కోరింది. ఈ మేరకు బుధవారం ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి బోర్డు మెంబర్ సెక్రటరీకి ఇండెంట్ పంపారు. ఆగస్టు నెలాఖరు వరకు 9 టీఎంసీ లు తీసుకునేందుకు రిలీజ్ ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. కృష్ణా నదిలో భారీ వరదలు వస్తున్నందున తాము పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకునేందుకు రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు. 71 టీఎంసీల్లో ఇదివరకే రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన 9 టీఎంసీలను మినహాయించి 62 టీఎంసీ లు తీసుకునేందుకు అనుమతివ్వాలని కోరారు. ఎస్​ఆర్ బీసీకి 22 టీఎంసీలు, తెలుగు గంగ ప్రాజెక్టు కు 30 టీఎంసీ లు, నిప్పులవాగుకు 14 టీఎంసీ లు, హెచ్ ఎన్ ఎస్​కు 5 టీఎంసీలు కేటాయించాలని కోరారు.

నీటి తరలింపు ఆపాలనడంతో కొత్త ఇండెంట్

తాము ఆగస్టు చివరి వరకు ఇచ్చిన రిలీజ్ ఆర్డర్ కు మించి నీటిని తరలించారని, పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే నీళ్ల విషయంలో వివాదాలకు తావు ఇవ్వొద్దని ఏపీకి కృష్ణా బోర్డు మంగళవారం లెటర్‌ రాసింది. దీనికి స్పందించిన ఏపీ కొత్తగా ఇండెంట్ పంపింది. రిలీజ్ ఆర్డర్ ఎలాగైనా వస్తుందన్న ధీమాతో పోతిరెడ్డిపాడు నుంచి భారీగా నీటిని తరలిస్తోంది.

 

Latest Updates