ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇవ్వండి

  • ఏపీ, తెలంగాణకు గోదావరి బోర్డు ఆదేశం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర విభజన తర్వాత గోదావరి నదిపై చేపట్టిన కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌‌‌‌లను వీలైనంత త్వరగా అందజేయాలని గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) తెలంగాణ, ఏపీని ఆదేశించింది. ఈ మేరకు జీఆర్‌‌‌‌ఎంబీ మెంబర్‌‌‌‌ పీఎస్‌‌‌‌ కుటియాల్‌‌‌‌ రెండు రాష్ట్రాల ఇరిగేషన్‌‌‌‌ ఈఎన్సీలకు శుక్రవారం లెటర్‌‌‌‌ రాశారు.  పోయినేడాది మే 14న నిర్వహించిన జీఆర్‌‌‌‌ఎంబీ మీటింగ్‌‌‌‌లో ప్రాజెక్టుల డీపీఆర్‌‌‌‌లు ఇస్తామని రెండు రాష్ట్రాలు చెప్పాయని గుర్తు చేశారు. అక్టోబర్‌‌‌‌ 6న నిర్వహించిన రెండో అపెక్స్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లోనూ ఇద్దరు సీఎంలు డీపీఆర్‌‌‌‌లు ఇచ్చేందుకు అంగీకరించారని, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. ఆయా ప్రాజెక్టులకు టెక్నికల్‌‌‌‌ అప్రైజల్‌‌‌‌ కోసం డీపీఆర్‌‌‌‌లు అందజేయాలని సూచించారు. తెలంగాణ 7, ఏపీ 4 ప్రాజెక్టుల డీపీఆర్‌‌‌‌లు వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.

ఏయే ప్రాజెక్టులంటే..

తెలంగాణ.. కాళేశ్వరం థర్డ్‌‌‌‌ టీఎంసీ, దేవాదుల థర్డ్‌‌‌‌ ఫేజ్‌‌‌‌, సీతారామ లిఫ్ట్‌‌‌‌ స్కీం, తుపాకులగూడెం బ్యారేజీ, మిషన్‌‌‌‌ కాకతీయ (వాటర్‌‌‌‌ గ్రిడ్‌‌‌‌), లోయర్‌‌‌‌ పెన్‌‌‌‌గంగాపై నిర్మిస్తున్న మూడు బ్యారేజీలు, రామప్ప -పాకాల లేక్‌‌‌‌ డైవర్షన్‌‌‌‌ స్కీం ప్రాజెక్టుల డీపీఆర్ లు, ఏపీ.. పట్టిసీమ లిఫ్ట్‌‌‌‌ స్కీం, పురుషోత్తపట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు, గోదావరి–కృష్ణా–పెన్నా లింక్‌‌‌‌ ప్రాజెక్టుల డీపీఆర్‌‌‌‌లు ఇవ్వాలని జీఆర్ఎంబీ ఆదేశించింది.

ఇవి కూడా చదవండి..

స్కూళ్ల రీఓపెన్ ‌పై 27న నిర్ణయం..?

రైతులు పంటలను మార్కెట్​లోనే అమ్ముకోవాలె

ప్రాణహిత ప్రవాహం తగ్గింది.. యాసంగికి నీళ్లెట్ల..?

పీహెచ్‌‌‌‌సీ నుంచే పెద్ద డాక్టర్‌‌‌‌కు చూపెట్టుకోవచ్చు

 

 

 

 

Latest Updates