బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంక్

ప్రస్తుత అకాడమిక్ ఇయర్ లో కరోనా కారణంగా విద్యార్థుల చదువులు సక్రమంగా జరగలేదు. ఇంటర్ నెట్ కనెక్ట్ సమస్య ఉన్న ప్రాంతాల్లో ఆన్ లైన్ క్లాసులు వినే అవకాశాలు కూడా సాధ్యం కావడంలేదంటూ పాఠశాల విద్యపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ క్రమలో బోర్డు పరీక్షలకు హాజరయ్యే 10,12  విద్యార్ధులకు ఉపయోగపడేలా పాఠాల వారీగా ముందుగానే ముఖ్యమైన ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ బ్యాంకు తయారు చేసి ఇవ్వాలంటూ విద్యాశాఖకు సూచించింది. అంతేకాదు పరీక్షలకు  ప్రశ్నలు కూడా ఆ క్వశ్చన్  బ్యాంకు నుంచే ఎంపిక చేయాలంది.టీవీ, ఆలిండియా రేడియోల్లో వివిధ తరగతుల విద్యార్థుల కోసం ప్రసారమయ్యే పాఠాల బోధన వివరాలను తెలియజేస్తూ ప్రకటనలు ఇవ్వాలని పార్లమెంటరీ కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ వినయ్ సహస్ర బుద్దే తెలిపారు.

Latest Updates