ఇమామ్‌లకు ఇచ్చినట్లే.. అయ్యగార్లకు కూడా ఇవ్వాలి

అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేశారని ఆయన అన్నారు. రాష్ట్రంలో దాదాపు 9 వేల స్కూళ్లు మూసివేశారని ఆయన అన్నారు. ‘మజీద్‌లో పని చేసే ఇమామ్‌లకు జీతాలు పెంచారు. అట్లనే దేవాలయాల్లో పని చేసే అయ్యగార్లకు కూడా జీతాలు పెంచాలి. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు భూమి ఇవ్వలేదు. పక్క రాష్ట్రంలో ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చారు. మన రాష్ట్రంలో మాత్రం ఉద్యోగులకు పీఆర్సీ లేదు, ఐఆర్ కూడా ఇవ్వడం లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ముందుకుసాగడంలేదు. ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద కేంద్రం నుంచి ఇండ్ల నిర్మాణం కోసం ఎన్ని నిధులు వచ్చాయో చెప్పాలి. మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్‌లు పెట్టింది. దిశ ఘటన జరిగింది మన తెలంగాణలో. దిశ పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేసింది ఏపీలో. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇక్కడ అటువంటి పోలీస్ స్టేషన్ల అవసరం లేదా?’ అని ఆయన అన్నారు.

For More News..

రాజగోపాల్ రెడ్డిని ఉరికించి ఉరికించి కొడుతారు

నేను చెప్పేది వినే ధైర్యం టీఆర్ఎస్‌కు లేదు

పుల్వామా ఎటాక్: బాంబు తయారీకి కావలసిన వస్తువులు అమెజాన్‌లో కొన్న నిందితులు

నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Latest Updates