పోలవరంపై పెట్టిన ఖర్చులు ఇవ్వండి: ఏపీ

గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం కోసం ఖర్చు చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్ర జలవనరుల శాఖ.. ఆర్థిక శాఖ అనుమతి కోసం ఫైల్ ను పంపింది.

ఆర్థికశాఖ అనుమతి ఇస్తే ఫైల్ ను జలవనరులశాఖ నాబార్డుకు పంపనున్నారు అధికారులు. ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి అనుమతి ఇస్తే నిధుల విడుదలకు అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు కేంద్ర అటవీపర్యావరణ శాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్న స్టాఫ్ వర్క్ ఉత్తర్వుల శాశ్వత నిలుపుదలపైనా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం కోరింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.5వేల కోట్లు ఖర్చుచేసింది. ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చులను వెనక్కి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

Latest Updates