వైరల్ వీడియో: భారీ మంచుకొండ కరిగి రోడ్డుపైకి వచ్చింది

మంచుకొండ కరిగి రహదారిపైకి రావడం మీరెప్పుడైనా చూశారా? రహదారి మూసుకుపోవడంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు వెంటనే ఏం చేశారో తెలుసా?.  గత కొన్నిరోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తుంది. ఆ మంచువర్షాల ధాటికి  హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో 10 అడుగుల ఎత్తైన ఓ మంచుకొండ విరిగి హైవేపైకి జారిపోయింది.  దీంతో అక్కడి ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి నవీద్ ట్రంబూ షేర్ చేశారు.  ఎత్తైన ఓ మంచుకొండ కరిగి నెమ్మదిగా రహదారిపై కదులుతూ వస్తున్నట్టున్న  వీడియోలో  అక్కడి పర్యాటకులు ఆ వెండికొండను తమ కెమెరాల్లో బంధించడానికి ప్రయత్నించడం చూడవచ్చు. హైవే పై ఉన్న పర్యాటకులు జరగబోయే ప్రమాదాన్ని గ్రహించి తమ కార్లను వెనక్కి మళ్లించారు.

Latest Updates