ఫేస్ బుక్ ట్రెయినీ జీతం 5.6 లక్షలు!

  • మరే సంస్థా ఇంతివ్వడం లేదు
  • రెండో స్థా నంలో అమెజాన్

నేటి జాబ్ మార్కె ట్ చాలా టఫ్. డిగ్రీ పట్టా చేతపుచ్చుకున్న ప్రతి ఒక్కరికీ కలల జాబ్ లో ఓ వైపు స్కిల్స్, మరోవైపు కాంపిటీషన్ సవాల్ విసురుతుంటాయి. ఇలాంటి టైంలో అవకాశాలను అరచేతిలోకి తెచ్చే పెట్టేది ఇంటర్న్​షిప్. ఇది చేస్తున్నప్పుడు వచ్చే డబ్బు చాలా తక్కువ. కానీ ఫేస్ బుక్ లో అలాకాదు. నెలకు అక్షరాల 5.61 లక్షల రూపాయల జీతం ఇస్తోంది. అంటే ఒక ఇంటర్న్ ఏడాది పాటు ఫేస్ బుక్ లో పని చేస్తే రూ.67.37 లక్షల వేతనంగా ఇస్తున్నారన్నమాట. సాధారణంగా అమెరికన్ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పని చేస్తే ఉద్యోగులకు రూ.37 లక్షల వార్షిక వేతనం అందుతుంది. అంటే ఉద్యోగులతో పోల్చితే ఇంటర్న్స్ కు ఫేస్ బుక్ డబుల్ శాలరీలు ఇస్తోందన్నమాట. గ్లాస్ డోర్ ఇటీవల చేసిన సర్వేలోఈ విషయం తేలింది.

ఫేస్ బుక్ లో పని చేసే ఉద్యోగులూ భారీగా శాలరీలు తీసుకుంటున్నారు. ఒక్కరు సగటున నెలకు 14లక్షల రూపాయలు డ్రా చేస్తున్నట్లు గ్లాస్ డోర్ వెల్లడించింది. ఇది పక్కనబెడితే పోయిన వారం ఫేస్ బుక్ కాంట్రాక్టు ఉద్యోగులపై వరాల వర్షం కురిపించింది. గంటకు ఇచ్చే వెయ్యి రూపాయల వేతనాన్ని ,1200 రూపాయలకు పెంచింది. మెట్రోపాలిటన్ ఏరియాల్లో పని చేసే వారికైతే 1500 రూపాయలకు పెంచింది.

రెండో స్థానంలో అమెజాన్

ఫేస్ బుక్ తర్వాత అమెజాన్ ఎక్కువ శాలరీలను ఆఫర్ చేస్తోంది. అమెజాన్ లో పని చేసే ఉద్యోగులు సగటున నెలకు రూ.5.41 లక్షల వేతనం అందుకుంటున్నారు. ఆ తర్వాత సేల్స్ ఫోర్స్ కంపెనీరూ.5.37 లక్షలు, గూగుల్ రూ.5.25 లక్షల శాలరీఇస్తున్నాయి

మారని ఇంటర్న్ శాలరీస్

ఫేస్ బుక్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇంటర్న్ శాలరీలను చివరగా 2017లో పెం చింది. నాటి నుంచి వేతనాలను తగ్గించలేదు. ఈ రెండేళ్లలో ఇంటర్న్స్ కు అమెజాన్ ఇచ్చే వేతనాలు మాత్రం రూ.4.48 లక్షలనుంచి రూ.5.41 లక్షలకు పెరిగాయి. గూగుల్,యాపిల్ కంపెనీలిచ్చే జీతాల్లోనూ మార్పులొచ్చాయి .

Latest Updates