ఇండియన్ అమ్మాయితో ఆసీస్ ఆల్ రౌండర్ లవ్ మ్యారేజ్

glenn-maxwell-announces-engagement-to-indian-orgin-girlfriend-vini-raman

ఆస్ట్రేలియా హిట్టర్, ఆల్ రౌండర్, సిక్సర్ల వీరుడుగా పిలిచే మ్యాక్స్ వెల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. IPL నుంచి ఇండియాతో అనుబంధం ఉన్న అతడు.. భారత సంతతి మహిళనే పెళ్లి చేసుకోనున్నాడు. మెల్‌ బోర్న్‌కు చెందిన భారత సంతతి అమ్మాయి వినీ రామన్‌(ఫార్మాసిస్ట్‌)ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రేమించిన అమ్మాయితోనే ఇటీవల తనకు ఎంగేజ్‌ మెంట్‌ జరిగిన విషయాన్ని మాక్స్‌ వెల్‌ సోషల్‌ మీడియాలో తెలిపాడు.

ఈ సందర్భంగా కాబోయే భార్యతో దిగిన ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. తన  గర్ల్‌ ఫ్రెండ్‌ వినీ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ చూపిస్తూ ఫొటోకు పోజునివ్వడం విశేషం.  వీరిద్దరూ గత కొన్నాళ్లుగా  ప్రేమలో ఉన్నారని ఆసీస్‌ క్రికెటర్లు చెబుతున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న మ్యాక్స్ వెల్ కు సోషల్ మీడియాలో విషెస్ తెలుపుతున్నారు.

View this post on Instagram

💍

A post shared by Glenn Maxwell (@gmaxi_32) on

Latest Updates