కరోనా సంక్షోభం నుండి బయట పడేందుకు ఐదేళ్లు పడుతుంది: కార్మెన్ రీన్‌హర్ట్

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని… ఈ సంక్షోభం నుంచి బయట పడేందుకు చాలా సమయంపడుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐదేండ్లు పడుతుందని చెప్పారు ప్రపంచ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త కార్మెన్ రీన్‌హర్ట్. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్, షట్ డౌన్ వంటివి చేపట్టారని, ఈ పరిమిత చర్యలు ఇప్పుడు ఎత్తివేసి, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి కనీసం కోలుకోవడానికి ఐదు ఏళ్లు పట్టొచ్చని చెబుతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆర్థిక వ్యవస్థ మరింతగా క్షీణించిందని. ఇది మరింతగా అసమానతలను పెంచుతుందని కార్మెన్ అన్నారు.

Latest Updates