మనం గ్లోబల్ పవర్స్, గుడ్ ఫ్రెండ్స్.. ఇండియన్స్‌కు మైక్ పాంపియో విషెస్

వాషింగ్టన్: ఇండియా 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో పలు దేశాల ప్రముఖులు ప్రధాని మోడీకి, దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. నేపాల్ ప్రధాని కేపీ ఓలి శర్మ మోడీకి శుభాభినందనలు తెలిపారు. తాజాగా యూఎస్ సెక్రటరీ ఆఫ్​ స్టేట్ మైక్ పాంపియో ఇండిపెండెంట్స్ డే విషెస్ చెబుతూ స్టేట్‌మెంట్ విడుదల చేశారు. ఇండియా, అమెరికాలు గొప్ప సమష్టివాద ప్రజాస్వామ్య దేశాలని, గ్లోబల్ పవర్స్‌ అని, మంచి మిత్రులని పాంపియో చెప్పారు. ఇండియా స్వాతంత్ర్యం సాధించినప్పటి నుంచి ఇరు దేశాలు సన్నిహిత సంబంధాలు, ప్రజాస్వామ్య సంప్రదాయాలను కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు.

విశ్వ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా గత కొన్నేళ్లలో మా సంబంధాలు మెరుగయ్యాయని పాంపియో అన్నారు. 21వ శతాబ్దంలో విశ్వ రక్షణ, శ్రేయస్సుకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కలసి ముందుకెళ్తున్నామని తెలిపారు. ‘ఈ ఏడాది ఆరంభంలో నేను చెప్పినట్లుగానే ఇండియా–అమెరికాలు ఒకర్నొకరు గొప్ప సమష్టివాద ప్రజాస్వామ్య, గ్లోబల్ పవర్స్‌గా, మంచి మిత్రులుగా చూస్తాయి. ఇండియా ప్రజలకు హ్యాప్పీ ఇండిపెండెంట్స్‌ డే’ అని పాంపియో చెప్పారు.

Latest Updates