జీఎంఆర్‌ రాజమండ్రి అప్పు తగ్గింది

GMR resolves Rajahmundry plant's debt with lenders
  • రిజొల్యూషన్‌ ప్లాన్​కు ఆర్థిక సంస్థలు ఓకే
  • సహజవాయువు లేక చాన్నాళ్లు చతికిలబడిన ప్లాంట్

జీఎంఆర్‌ గ్రూప్‌ లోని జీఎంఆర్‌ రాజమండ్రి ఎనర్జీ లిమిటెడ్‌ రిజొల్యూషన్‌ ప్లాన్‌ కు అప్పులు ఇచ్చే సంస్థల నుంచి ఆమోదం వచ్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో బైటపడేందుకు రిజొల్యూషన్‌  ప్లాన్‌ రూపొందించిన ఈ కంపెనీ వారి ఆమోదం కోసం పంపింది. ఆ ప్లాన్‌ కు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందని జీఎంఆర్‌ గ్రూప్‌ శుక్రవారం వెల్లడించింది.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: 768 మెగావాట్ల గ్యాస్‌ బేస్డ్‌ పవర్‌ ప్లాంట్‌ ను ఆంధ్రప్రదేశ్‌ లో జీఎంఆర్‌ రాజమండ్రి ఎనర్జీ లిమిటెడ్‌నెలకొల్పింది. ఈ కంపెనీకి మొత్తం రుణాలు రూ.2,353 కోట్లకు పెరిగిపోయాయి. దాంతో ఇప్పుడు ఆ రుణాలను రూ. 1,412 కోట్లకు  తగ్గించుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక మిగిలిన రూ.1,130 కోట్ల అప్పు మీదా వడ్డీ భారం తగ్గుతుందని పేర్కొంది. ఈవడ్డీ 9 శాతమని, 20 ఏళ్లలో రుణాన్ని తిరిగి చెల్లించేలా రుణదాతలు ఒప్పుకున్నారని జీఎంఆర్‌ తెలిపింది. రూ. 1,412 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించేందుకు జీఎంఆర్‌ రాజమండ్రి ఎనర్జీ లిమిటెడ్‌ కు రూ. 395 కోట్లను సమకూర్చినట్లు జీఎంఆర్‌ గ్రూప్‌ వెల్లడించింది. రుణాలను, వాటిపై వడ్డీని తిరిగి చెల్లించేందుకు ఏడాది కాలానికి సరిపోయేలా నిధులను ఇచ్చినట్లు పేర్కొంది. మిగిలిన రూ. 941 కోట్ల రుణాన్ని లాంగ్‌డేటెడ్‌  క్యుములేటివ్ రిడీమబుల్  ప్రిఫరెన్స్‌ షేర్లుగా మార్చేందుకు కూడా రుణదాతలు అంగీకరించారని కంపెనీ తెలిపింది.

17 వ సంవత్సరంలో మొదలుపెట్టి 20 వ సంవత్సరంలోపు వాటిని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఇరు వర్గాలకూ ఆమోదయోగ్యమైన రిజొల్యూషన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను రూపొందించడం ఆనందం కలిగిస్తోందని జీఐఎల్‌‌‌‌‌‌‌‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గ్రంధి కిరణ్‌ కుమార్‌ చెప్పా రు. దీర్ఘకాల పరిష్కారం కంపెనీకి ఎంతో ఉపయోగకరమైందని పేర్కొన్నారు. ఈ రిజొల్యూషన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ ఫలితంగా, జీఎంఆర్‌ గ్రూప్‌ రుణం తగ్గిపోతుందని, గ్రూప్‌ భవిష్యత్‌ మెరుగవడానికి సాయపడుతుందని చెప్పా రు.

రాబోయే ఏళ్లలో గ్యాస్‌ సరఫరా మెరుగుపడుతుందని, పర్యవసానంగా రాజమండ్రి పవర్‌ ప్లాంట్‌ పనితీరు బాగుంటుందని ఆశిస్తున్నట్లు కిరణకుమార్‌ పేర్కొ న్నారు. దేశపు ఇంధన అవసరాలు నెరవేర్చడంలో గ్యాస్‌ , విండ్ , సోలార్‌ పవర్‌ ప్లాంట్లు కీలకమైనవని అన్నారు. రిజొల్యూషన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ తర్వాత జీఎంఆర్‌ రాజమండ్రి ఎనర్జీ కంపెనీ ఈక్విటీలో ప్రమోటర్లకు( అంటే జీఎంఆర్‌ గ్రూప్‌ ) 45 శాతం, రుణదాతలకు 55 శాతం వాటా ఉంటాయి. ఇది రెండు వర్గాలకూ ప్రయోజనకరమైన పరిష్కారమవుతుందనే ఆశాభావాన్ని కిరణ్‌ కుమార్‌ వ్యక్తం చేశారు.మే 2016 నాటి కి రూ. 2,366 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఈ పవర్‌ ప్రాజెక్టు ఆర్‌ బీఐ గైడ్‌ లైన్స్‌ మేరకు స్ట్రా టజిక్‌ డెట్‌ రీస్ట్రక్చరిం గ్‌ (ఎస్‌ డీ ఆర్‌ )కు వెళ్లింది. పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం2012 నాటికే పూర్తయింది. కానీ గ్యాస్‌(సహజవాయువు) అందుబాటులో లేకపోవడంతో ఉత్పత్తిలో జాప్యమైంది.  కేజీడీ 6బేసిన్‌‌‌‌‌‌‌‌లో సహజవాయు నిల్వలు భారీగా తగ్గిపోవడంతో, ఈ పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయింది. ఎట్టకేలకు 2015 అక్టో బర్‌22 నాటికి రాజమండ్రి పవర్‌ప్లాంట్ ఉత్పత్తి మొదలుపెట్టింది.

Latest Updates