ముందు ఢిల్లీ వెళ్లి అక్కడి పరిస్థితిని కంట్రోల్ చేయండి

హైదరాబాద్: దేశ రాజధానిలో  అల్లర్లు  జరుగుతుంటే  కేంద్ర సర్కార్  ఏం చేస్తుందని ప్రశ్నించారు  ఎంఐఎం చీఫ్  అసదుద్దీన్ ఒవైసీ.  ఢిల్లీ  అల్లర్లు  రాజకీయ ప్రేరేపితేమే  అన్నారు. ఢిల్లీలో  అల్లర్లు జరుగుతుంటే  కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి   హైదరాబాద్ లో ఎందుకు  ఉన్నారని   ప్రశ్నించారు అసద్.  కిషన్ రెడ్డి …ముందు  ఢిల్లీ వెళ్లి  అలర్లను  కంట్రోల్ చేయాలన్నారు. అక్కడ మంటలు  తగ్గించకుండా  హైదరాబాద్ లో  కూర్చుని  ఇతర పార్టీలను విమర్శించడం  సరికాదన్నారు అసద్.

అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  ఈశాన్య ఢిల్లీలో హింసను పథకం ప్రకారం ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మైనార్టీలను ఒవైసీ రెచ్చగొడుతుందని మండిపడ్డారు. కావాలనే ఒవైసీ ముస్లిం సోదరులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. ఎంతమంది ఒవైసీలు వచ్చినా.. సీఏఏను వెనక్కి తీసుకోబోమని స్పష్టంచేశారు.

Latest Updates