ధోనీ రాంచీలో ఉంటాడు..వెళ్లి అడగండి

ముంబై: ఎంఎస్‌‌ ధోనీ ఫ్యూచర్‌‌ ప్లాన్స్‌‌ గురించి తనకేం తెలియదని, తెలుసుకోవాలని అనుకుంటున్న వారు రాంచీ వెళ్లి మహీనే అడగండని టీమిండియా స్టార్‌‌ ఓపెనర్‌‌ రోహిత్‌‌శర్మ అన్నాడు. హర్భజన్‌‌ సింగ్‌‌తో గురువారం ఇన్‌‌స్టాగ్రామ్‌‌ లైవ్‌‌ చాట్‌‌లో పాల్గొన్న రోహిత్‌‌ ఫ్యాన్స్‌‌ అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా బదులిచ్చాడు. గతేడాది జులైలో వన్డే వరల్డ్‌‌కప్‌‌ తర్వాత ధోనీ ఆటకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్‌‌తో రీఎంట్రీ ఇస్తాడనుకుంటే కరోనా దెబ్బకు లీగ్‌‌ వాయిదా పడింది. అయితే ధోనీ నిజంగా క్రికెట్‌‌ ఆడకూడదు అనుకుంటే అండర్‌‌ గ్రౌండ్‌‌కు వెళ్లిపోతాడని రోహిత్‌‌ అన్నాడు. ‘ ఎంఎస్‌‌ ధోనీ క్రికెట్‌‌ ఆడడం ఆపేస్తే ఎవ్వరికీ దొరకడు. అండర్‌‌ గ్రౌండ్‌‌లోకి వెళ్లిపోతాడు. ధోనీ రాంచీలో ఉంటాడని అందరికీ తెలుసు. అతను మళ్లీ ఆడతాడా లేదా అనే డౌట్‌‌ ఉన్నవాళ్లందరూ అక్కడికి వెళ్లి నేరుగా అతన్నే అడగండి. లాక్‌‌డౌన్‌‌ ముగిశాక కారు, బైక్‌‌, ఫ్లయిట్‌‌ ఏదో ఒక దాని సాయంతో రాంచీకి వెళ్లి నువ్వు ఏం చేస్తావు అని అడగండి. మాకైతే తన గురించి ఏమి తెలియదు. వరల్డ్‌‌కప్‌‌ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు’ అని రోహిత్‌‌ చెప్పుకొచ్చాడు.

 

 

Latest Updates